6, మార్చి 2015, శుక్రవారం

::: భూమి విలువ :::
రాజధాని వస్తే భూమికి విలువ పెరుగుతుంది తద్వారా రైతులు లాభపడతారు అంటున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే...

ఎంతోమందిని కాలిచేయింది, ఊళ్లకువూల్లు వలసలు పంపి మనం నాగార్జున సాగర్ డాం కట్టుకున్నాం, దేనికి? 
అలాగే ఇప్పుడు 293 గ్రామాలలోని సుమారు 3 లక్షల మందిని వాళ్ళ గొడ్డు గోదాము, చెట్టు పుట్ట, ఇల్లు వాకిలి, పొలిమేర రాయిని, దేవుడి గుడిని అన్ని వదిలేసి పొండి అని నిర్దాక్షిణ్యంగా తరలిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం దేనికి ?
సాగు భూమి కోసం. నీటి కోసం. పంటలు పండడం కోసం. బీడుగా ఉన్న నేలని సస్యస్యామలం చేయడం కోసం. నీరే మనకి ఆధారం. జీవి ప్రాణాలకి కావాల్సింది నీరే. ఆ నీటిని ఒడిసిపట్టి ప్రకాశం బారేజి కట్టి వాటర్ స్టోరేజ్ వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి నేల సారవంతమై 365 రోజులూ పచ్చగా వుండే నేల ఎన్ని కోట్లవిలువైనదో రైతు పుట్టుక పుట్టిన ప్రతివాడికి తెలుస్తుంది. మన ముక్యమంత్రికి వాళ్ళ మంత్రులకి తప్ప. 
అసలు నేలకి విలువ తనలో మొక్కలు పెరిగినప్పుడే. మొక్క మొలవని నేల ఎడారి అవుతుంది. దానికి విలువ వుండదు. మరి మన బాబు గారు కన్ను పచ్చని పైరుల మీద ఎందుకు పడిందో అర్ధంకాదు యెంత ఆలోచించినా. 
రైతుకి బూమి విలువ పెరగడం అంటే తనపోలం అన్నపూర్ణగా ఉన్నప్పుడే. "నీకేంట్రా సాంబయ్యా నీ పొలం మూడు పంటలుపండుద్ది నీకన్నా లచ్చాదికారి ఎవడ్రా వూళ్ళో" అంటుంటారు ఇప్పరికీ ఊళ్లలో.
కాని అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి పైరు కన్నా దాని విలువ పెరగడమే ముక్యం. అచ్చు మన బాబు గారిలా. ఇలాంటి నేల ఈ రెండు జిల్లాలలో ఇంకోచోట లేదు. 
రాజధానే కట్టాల్సివస్తే 50 చదరపు కిలోమీటర్ల పరిదిలో ప్రభుత్వ భూమి కూడా దాదాపు 30 వేల ఎకరాలు ఉండొచ్చు. అంతకనా ఎక్కువే ఉండొచ్చు. అదీ పంటలు పండని భూమి. అలాంటి భూమిని విలువ పెంచితే బాబుగారు దేవుడు అనొచ్చు. అదివదిలెసి ఏ రైతుకైనా అత్యంత విలువైన, సారవంతమైన నేలని అమ్ముకోండి, మాకిచ్చేయండి. వ్యవసాయం మానండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి అంటే వీడు మనిషా లేక మానా. పోనీ అంతగా వాస్తు అనుకుంటే వినుకొండ ఎలాగూ వుంది. అదీ కాక ఇదీ కాక పచ్చని పైరుల్లో కాంక్రీట్ పొద్దామనుకొనె ఈ చర్య దేశ సుభిక్షాన్ని కోరుకొనే వాడెవ్వడూ ఒప్పుకోడు.
రేపు పోలవరం బ్యాక్ వాటర్లో నీలాగే ఇంకొకడు పొలాల్లో రాజధానొ లేక ఏ ఇండస్ట్రియల్ కారిడారో పెడతాను అంటే ఇప్పటి ప్రజల త్యాగాలకి విలువ ఉంటుందా. మనం నాగారికులమేనా బాబుగారు ఒక్కసారి ఆలోచించండి...

4, మార్చి 2015, బుధవారం

స్మార్ట్‌సిటీల పేరుతో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు ప్రజల నెత్తిన భారాలు మోపుతున్నాయి. స్మార్ట్‌సిటీల ముసుగులో విదేశీ కంపెనీలు, బడా ప్రైవేట్‌ సంస్థలకు పట్టణాలను కట్టబెట్టే కుట్రలు సాగిస్తున్నాయి

.Ysr వాన్ పిక్ పేరుతో 24 వేల ఎకరాలు సేకరిస్తే స్మార్ట్ సిటి పేరు తో చంద్రబాబు 54 వేల ఎకరాలు. ఇద్దరికీ తేడా ఏమీటి?

రాజధాని ఏర్పాటు పేరుతో 30 వేల ఎకరాల పంట భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో విధి విధానాలు లేకుండా స్వాధీనం చూస్తే ఇద్దరికీ తేడా ఏమీటి?

 బడా పారిశ్రామికవేత్తలు, కృష్ణాతీరంలో కబ్జాచేసిన 2 వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి సరి

దేశంలో 30 వేల ఎకరాలు -సేకరించిన రాజధానే లేదు
-హైదరాబాద్‌లో రాజధాని 225.520 ఎకరాలే
-చండీగఢ్ ఉన్నది 114 చ.కి.మీ.లోనే

 బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే కార్పొరేట్ మూకలను చుట్టు పెట్టుకుని 30 వేల ఎకరాల్లో ఆయన చేసేది రాజధాని నిర్మాణమా? రియల్ ఎస్టేట్ దందానా?


 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న త్రీడీ సినిమా. ఆయన భజన బందం, ఆస్థాన పత్రికలు కూడా యథాశక్తి ఊదరగొడుతున్నాయి. తామేం తక్కువ తినలేదన్నట్టు ఆస్థాన ఎన్నారైలూ సదస్సులు పెట్టి భారీగా చందాలు సేకరిస్తున్నారు. ఇక్కడా హుండీలు. అవి చాలవన్నట్టు పత్రికలు కూడా ఆ కార్యక్రమంలో తలమునకలవుతున్నాయి. ఇంతకీ ఒక రాజధానికి ఎంత భూమి కావాలి? దేశంలో అనేక రాజధానుల వైశాల్యమెంత? ఏపీ జనాభా ఎంత? ఆదాయమెంత? దానికి ఈ 30వేల ఎకరాలకు పొంతన ఉందా?

ప్రపపంచలోనే ప్రతిష్టాత్మకమైన రాజధానిని నిర్మిస్తానని ప్రచారం చేస్తూ పచ్చటి పంటలు పండే 30 వేల ఎకరాల భూములను కొల్లగొడుతున్నారు.

ఈ మొత్తం ప్రక్రియ వెనుక కార్పొరేట్ సంస్థల మాయాజాలం ఉందనే ఆరోపణలున్నాయి. టీడీపీ పంచన చేరిన ఈ కార్పొరేట్ సంస్థల యజమానులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వాటికి భారీ మార్కెట్ సష్టించే పనిలో భాగంగానే ఇదంతా జరుగుతుందని అంటున్నారు.

చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నారని మేధావులు అంటున్నారు. ఆయనదంతా మాయ. చెప్పేది కొండంత..చేసేది గోరంత..ఒకవైపు నిధులు లేవంటారు. రాజధానికి హుండీలు పెడతారు. చందాలు వసూల చేయిస్తారు. మరోవైపు కోట్ల ఖర్చుపెట్టి ఉత్సవాలు చేస్తారు. చార్టర్‌ైఫ్లెట్లు వేసుకుని సింగపూర్ వెళ్తారు.

 ప్రభుత్వ భూమి ఉండగా సేకరణ దేనికి?
అసలు భూసేకరణే అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. అవి సరిపోతాయి. స్కూల్స్, హౌజింగ్, అధికారుల నివాసాలకు, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లకు, అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయ నిర్మాణాలకు ఎంత భూమి అవసరమో చెప్పంది ముందు. 
-యలమంచలి శివాజీ


2, మార్చి 2015, సోమవారం

రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు నాశనం సబబా?

  • 23/12/2014
ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రైతు స్వరాజ్య వేదిక
హైదరాబాద్, డిసెంబర్ 22: రాజధాని నిర్మాణాన్ని రియల్ ఎస్టేట్ వ్యవహారంగా చూడటం తగదని రైతు స్వరాజ్య వేదిక ఆవేదన వ్యక్త చేసింది. రాజదాని నిర్మాణం కోసం తహతహలాడుతున్న ప్రభుత్వ తీరుచూస్తుంటే కొంత మంది వ్యక్తులకు లబ్ధిచేకూర్చేలా ఉందని విమర్శించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్, కనె్నగంటి రవి, ఉమాశంకరి మాట్లాడుతూ వేల రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాల భూములను నాశనం చేయడం ఎంత వరకు సబబని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను లాక్కొనేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తుందని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సూచించిన వాటిని సైతం పక్కన పెట్టి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందని విమర్శించారు. అన్నపూర్ణగా పేరొందిన విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న వేల ఎకరాల భూములను భవన నిర్మాణాల కోసం వినియోగించడం సరికాదని అన్నారు. దీని ద్వారా భూములు కోల్పోతున్న రైతులతో పాటు ఆయా వ్యవసాయక్షేత్రాలలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వారు ఉపాధికి దూరమవుతారని పేర్కొన్నారు. అలాంటి వారి కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం నిర్ధిష్టంగా పేర్కొనడం లేదన్నారు. ఎంతో మంది గిరిజనులను ముంచి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నుంచి రాజధాని అవసరాల కోసం నీటిని తరలించడం సరికాదని ఆ నీటిని కేవలం వ్యవసాయ అవసరాల కోసమే వాడాలని అన్నారు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల నుంచి సేకరించిన భూములను సరైన పారితోషకం, వారికి పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.