స్మార్ట్‌సిటీల పేరుతో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు ప్రజల నెత్తిన భారాలు మోపుతున్నాయి. స్మార్ట్‌సిటీల ముసుగులో విదేశీ కంపెనీలు, బడా ప్రైవేట్ సంస్థలకు పట్టణాలను కట్టబెట్టే కుట్రలు సాగిస్తున్నాయి
.Ysr వాన్ పిక్ పేరుతో 24 వేల ఎకరాలు సేకరిస్తే స్మార్ట్ సిటి పేరు తో చంద్రబాబు 54 వేల ఎకరాలు. ఇద్దరికీ తేడా ఏమీటి?
రాజధాని ఏర్పాటు పేరుతో 30 వేల ఎకరాల పంట భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో విధి విధానాలు లేకుండా స్వాధీనం చూస్తే ఇద్దరికీ తేడా ఏమీటి?
బడా పారిశ్రామికవేత్తలు, కృష్ణాతీరంలో కబ్జాచేసిన 2 వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి సరి
దేశంలో 30 వేల ఎకరాలు -సేకరించిన రాజధానే లేదు
-హైదరాబాద్‌లో రాజధాని 225.520 ఎకరాలే
-చండీగఢ్ ఉన్నది 114 చ.కి.మీ.లోనే
-హైదరాబాద్‌లో రాజధాని 225.520 ఎకరాలే
-చండీగఢ్ ఉన్నది 114 చ.కి.మీ.లోనే
బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే కార్పొరేట్ మూకలను చుట్టు పెట్టుకుని 30 వేల ఎకరాల్లో ఆయన చేసేది రాజధాని నిర్మాణమా? రియల్ ఎస్టేట్ దందానా?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న త్రీడీ సినిమా. ఆయన భజన బందం, ఆస్థాన పత్రికలు కూడా యథాశక్తి ఊదరగొడుతున్నాయి. తామేం తక్కువ తినలేదన్నట్టు ఆస్థాన ఎన్నారైలూ సదస్సులు పెట్టి భారీగా చందాలు సేకరిస్తున్నారు. ఇక్కడా హుండీలు. అవి చాలవన్నట్టు పత్రికలు కూడా ఆ కార్యక్రమంలో తలమునకలవుతున్నాయి. ఇంతకీ ఒక రాజధానికి ఎంత భూమి కావాలి? దేశంలో అనేక రాజధానుల వైశాల్యమెంత? ఏపీ జనాభా ఎంత? ఆదాయమెంత? దానికి ఈ 30వేల ఎకరాలకు పొంతన ఉందా?
ప్రపపంచలోనే ప్రతిష్టాత్మకమైన రాజధానిని నిర్మిస్తానని ప్రచారం చేస్తూ పచ్చటి పంటలు పండే 30 వేల ఎకరాల భూములను కొల్లగొడుతున్నారు.
ఈ మొత్తం ప్రక్రియ వెనుక కార్పొరేట్ సంస్థల మాయాజాలం ఉందనే ఆరోపణలున్నాయి. టీడీపీ పంచన చేరిన ఈ కార్పొరేట్ సంస్థల యజమానులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వాటికి భారీ మార్కెట్ సష్టించే పనిలో భాగంగానే ఇదంతా జరుగుతుందని అంటున్నారు.
చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నారని మేధావులు అంటున్నారు. ఆయనదంతా మాయ. చెప్పేది కొండంత..చేసేది గోరంత..ఒకవైపు నిధులు లేవంటారు. రాజధానికి హుండీలు పెడతారు. చందాలు వసూల చేయిస్తారు. మరోవైపు కోట్ల ఖర్చుపెట్టి ఉత్సవాలు చేస్తారు. చార్టర్‌ైఫ్లెట్లు వేసుకుని సింగపూర్ వెళ్తారు.
ప్రభుత్వ భూమి ఉండగా సేకరణ దేనికి?
అసలు భూసేకరణే అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. అవి సరిపోతాయి. స్కూల్స్, హౌజింగ్, అధికారుల నివాసాలకు, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లకు, అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయ నిర్మాణాలకు ఎంత భూమి అవసరమో చెప్పంది ముందు.
-యలమంచలి శివాజీ
అసలు భూసేకరణే అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. అవి సరిపోతాయి. స్కూల్స్, హౌజింగ్, అధికారుల నివాసాలకు, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లకు, అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయ నిర్మాణాలకు ఎంత భూమి అవసరమో చెప్పంది ముందు.
-యలమంచలి శివాజీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి