6, మార్చి 2015, శుక్రవారం

::: భూమి విలువ :::
రాజధాని వస్తే భూమికి విలువ పెరుగుతుంది తద్వారా రైతులు లాభపడతారు అంటున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే...

ఎంతోమందిని కాలిచేయింది, ఊళ్లకువూల్లు వలసలు పంపి మనం నాగార్జున సాగర్ డాం కట్టుకున్నాం, దేనికి? 
అలాగే ఇప్పుడు 293 గ్రామాలలోని సుమారు 3 లక్షల మందిని వాళ్ళ గొడ్డు గోదాము, చెట్టు పుట్ట, ఇల్లు వాకిలి, పొలిమేర రాయిని, దేవుడి గుడిని అన్ని వదిలేసి పొండి అని నిర్దాక్షిణ్యంగా తరలిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం దేనికి ?
సాగు భూమి కోసం. నీటి కోసం. పంటలు పండడం కోసం. బీడుగా ఉన్న నేలని సస్యస్యామలం చేయడం కోసం. నీరే మనకి ఆధారం. జీవి ప్రాణాలకి కావాల్సింది నీరే. ఆ నీటిని ఒడిసిపట్టి ప్రకాశం బారేజి కట్టి వాటర్ స్టోరేజ్ వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి నేల సారవంతమై 365 రోజులూ పచ్చగా వుండే నేల ఎన్ని కోట్లవిలువైనదో రైతు పుట్టుక పుట్టిన ప్రతివాడికి తెలుస్తుంది. మన ముక్యమంత్రికి వాళ్ళ మంత్రులకి తప్ప. 
అసలు నేలకి విలువ తనలో మొక్కలు పెరిగినప్పుడే. మొక్క మొలవని నేల ఎడారి అవుతుంది. దానికి విలువ వుండదు. మరి మన బాబు గారు కన్ను పచ్చని పైరుల మీద ఎందుకు పడిందో అర్ధంకాదు యెంత ఆలోచించినా. 
రైతుకి బూమి విలువ పెరగడం అంటే తనపోలం అన్నపూర్ణగా ఉన్నప్పుడే. "నీకేంట్రా సాంబయ్యా నీ పొలం మూడు పంటలుపండుద్ది నీకన్నా లచ్చాదికారి ఎవడ్రా వూళ్ళో" అంటుంటారు ఇప్పరికీ ఊళ్లలో.
కాని అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి పైరు కన్నా దాని విలువ పెరగడమే ముక్యం. అచ్చు మన బాబు గారిలా. ఇలాంటి నేల ఈ రెండు జిల్లాలలో ఇంకోచోట లేదు. 
రాజధానే కట్టాల్సివస్తే 50 చదరపు కిలోమీటర్ల పరిదిలో ప్రభుత్వ భూమి కూడా దాదాపు 30 వేల ఎకరాలు ఉండొచ్చు. అంతకనా ఎక్కువే ఉండొచ్చు. అదీ పంటలు పండని భూమి. అలాంటి భూమిని విలువ పెంచితే బాబుగారు దేవుడు అనొచ్చు. అదివదిలెసి ఏ రైతుకైనా అత్యంత విలువైన, సారవంతమైన నేలని అమ్ముకోండి, మాకిచ్చేయండి. వ్యవసాయం మానండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి అంటే వీడు మనిషా లేక మానా. పోనీ అంతగా వాస్తు అనుకుంటే వినుకొండ ఎలాగూ వుంది. అదీ కాక ఇదీ కాక పచ్చని పైరుల్లో కాంక్రీట్ పొద్దామనుకొనె ఈ చర్య దేశ సుభిక్షాన్ని కోరుకొనే వాడెవ్వడూ ఒప్పుకోడు.
రేపు పోలవరం బ్యాక్ వాటర్లో నీలాగే ఇంకొకడు పొలాల్లో రాజధానొ లేక ఏ ఇండస్ట్రియల్ కారిడారో పెడతాను అంటే ఇప్పటి ప్రజల త్యాగాలకి విలువ ఉంటుందా. మనం నాగారికులమేనా బాబుగారు ఒక్కసారి ఆలోచించండి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి