ఎవరి చేతిలో సృష్టించావు బాబూ!
PUBLISHED: SUN,MAY 31, 2015 12:03 AM Increase Font Size Reset Font Size decrease Font size
నీ సంపద సృష్టికి ప్రజల చేతుల్లో వనరులు పెట్టాలి. చెరువులు బాగుచెయ్యాలి. పొలాలకు నీరివ్వాలి. విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. సంపద పెరగాలి. కానీ అది సమాజ సంపద కావాలి. సంపద పెరగాలి కానీ అది ప్రజల కోసం పెరగాలి. ప్రజల పరం కావాలి. అంతేకానీ విసిరేస్తే రాలే గింజలు కాదు. జనమంటే అడుక్కుతినేవాళ్లో నువు పారేసింది ఏరుకునే వాళ్లో కాదు. సృష్టించింది చాల్లే గానీ, అది కరిగి జనంలోకి ప్రవహించే
చిత్తశుద్ధి చూపియ్యండి బాబు గోరూ!
చేతి మంత్రదండముతో ఎంతెంత సంపద సృష్టించినావు బాబూ. దొర గారూ. దొరలబాబుగారూ. సంపద. ఎటుచూసినా సంపద. కళ్లు తిరిగిపోయే సంపద. మల్టీ ప్లెక్సులు, మెగామాల్‌లు, రిసార్టులు, గోల్ఫ్‌లు, నోవోటెల్‌లు, పబ్బులు కళ్లు మబ్బులు పట్టే ప్లేబోయ్ క్లబ్బులు. క్లబ్బుల్లో మెరుపువెలుగుల మసకచాటు జీవితాలు. రోడ్డు మీద బియండబ్ల్యులు, పార్టీ ఆఫీసుల ముందు పోర్ష్‌కార్లు, కాఫీ షాపుల ముందు కిడ్స్ పార్క్ చేసే మినీ కూపర్‌లు. ద్యావుడా... ఏం సంపదరా బాబూ. వర్టిగో వచ్చి కళ్లు తిరిగేంత సంపద. ఈ భోగభాగ్యవైభవ చంద్రిక గురించి ఒక చిన్న ప్రశ్న వేసుకొని బ్రేక్ తీసుకుని బ్రీత్ తీసుకుని మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. కొంచెం వాటర్ తాగండి.
సంపద సృష్టించా! అనే మహానాటి ప్రకటన చూసి ఆ స్థాయిలో కాకపోయినా ఏదో మనకున్నంత బుర్రలో ఓ చిన్నప్రశ్న మొలిచింది. అదేమనగా....ఎవరి చేతిలో?. ఈ అనంత సంపద. షాంపేన్ నురగలా ఆగకుండా పొంగే సంపద ఎవరి చేత ఎవరి కోసం ఎలా సృష్టించబడింది. దాన్ని అనుబగిస్తున్న రాజాలెవరు. ఈ సంపద గుట్టలు పెరిగి పెద్దయిపోతుండగా వాటివైపు ఆశగా తలెత్తి చూస్తూ మిగి లిపోయే బతుకులెవరివి.
ఓ సీను. మీరే ఇమేజిన్ చేసుకోండి. ఒకాయన. సకల సిరిసంపదలతో ఊగితూ లిసోలిపోయేటాయన.
ఆయన తనకు చవగ్గా దొరికిన భూములు, ఫీజు లేకుండా దొరికిన లైసెన్సులు, భారీగా దొరికిన రాయితీల ద్వారా వచ్చిపడిన సంపద లోంచి కొంత తీసి ఇంట్లో జలపాతం కట్టుకున్నాడు. దాని నుంచి ఫోర్సుగా ఎగసిపడ్డ నీటి తుంపరలు ఆయన ఇంటి గోడవతల నివాసముంటున్న గుడిసెవాసుల మీద కూడా పడ్డాయి. వారు నాలుకలు బయటపెట్టి నిలబడితే వారి దాహం తీర్చాయి. దీన్ని ట్రికిల్ డౌన్ అంటారు. సృష్టించబడిన జలసంపద ఎంత ఎక్కువైతే నాలుకలు చాచి దాహం దాహం అంటున్న వారి గొంతు అంత ఎక్కువగా తడుస్తుంది.
రాశుల రాశుల సంపద నాటి నైజాము సర్కరోడికీ ఉంది. నేటి సుభ్రతో రాయ్‌కీ ఉంది. బ్రూనే సుల్తాను వరకూ ఎందుకు సుజనులు, నానీలు, జగనులు, మాట్రిక్సులు, గాలి రామలింగడులు వీరందరికీ సంపద ఉంది. భారతదేశములో వలే తెలుగు రాజ్యాలలో కూడా గత ఇరవై ఏళ్లలో నియోరిచ్ బాబులు పుట్టలు పుట్టలుగా పెరిగారు. సంపద పెంచుకున్నారు. ఆర్థిక అసమానతలు గత ఇరవై ఏళ్లకాలంలో రెండొందల శాతం పెరిగాయి. ఉన్నోడికీ లేనోడికీ మధ్య దూరం కొన్ని కాంతి సంవత్సరాలంత పెరిగిపోతున్నది. కనుక సంపద నిజం. కానీ, అది రాను రానూ కొందరిచేతిలోనే పేరుకుపోతున్నది చేదునిజం.
ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- ఎవరి లక్ష్యమైనా ఒకటే. సంపద సృష్టించడం. పెద్ద కెరటం వచ్చినపుడు అన్ని పడ వలూ పైకి లేస్తాయని చెప్పడమే ఆ విధాన సారాంశం. మొదట చంద్రబాబూ ఆపై రాజశేఖరరెడ్డి సంపద సృష్టి సిద్ధాంతాన్ని బాగా నమ్మారు. ఒకోసారి వాళ్లు తెలియక నమ్మారేమో అని కూడా అనుమానం వచ్చేది. కానీ మొన్నటి మహాప్రకటనతో ఆ అనుమానం పోయింది. కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు వైద్యమంత్రులూ కార్పొరేట్ కళాశాలల యజమానులు విద్యామంత్రులూ అవుతున్న వైనం చూసినా రాజధాని నిర్మాణంలో ఎంచుకున్న విధానం చూసినా, సంపద సృష్టి మోజు ఎంత పీక్‌లో ఉందో వెర్రీవీజీగా అర్ధమైపోతుంది.
ఉన్నతాదాయ వనరులకూ వ్యాపారులకూ కల్పించే ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా పోగుపడే సంపదలు పరోక్షంగా సమాజంలోని పేదవర్గాలకు మేలు చేస్తా యని ఒక వాదన. ఇదే ట్రికిల్ డౌన్. మహామాంద్యం కాలంలో విల్‌రోజర్స్ అనే ఒక అమెరికన్ వ్యంగ్యవ్యాఖ్యాత కాయిన్ చేసిన పదమిది. ఇది వాడుకున్నోడికి వాడుకున్నంత. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అధికారికంగా ఒక అర్ధశాస్త్ర పారిభాషికపదం కాకపోయినా, కేపిటలిస్టు రాజకీయాలు ఈ కాన్సెప్టును బాగా వాడుకున్నాయి. సంక్షేమపద్దులపై కోతలు విధించడానికి ధనికులకు కార్పొరేట్లకు మేళ్లు చేసే రాయి తీలు కల్పించడానికి, కేటాయింపులు జరపడానికీ ఇదొక బహానాగా పనికొచ్చింది. పనికొస్తూనే ఉంది. దురదృష్టావశాత్తూ ఇదొక విఫల విధానమనీ, దీని ఫలితాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపించాయనీ అనేక ప్రభుత్వాల అనుభవం నిరూపించింది. అయినంక కూడా సంపద సృష్టి నినాదం ప్రవచిస్తున్నారంటే దాని వెనుక వర్గప్రయోజనాన్ని చూడాల్సిరాక తప్పదు తమ్ముళ్లూ.
నిజానికి ఇది చాలా పాతది. అమెరికాలో పంతొమ్మిదో శతాబ్దం కాలంలోనే దీన్ని పరీక్షించారు. దాన్నే హార్స్ అండ్ స్పారో సిద్ధాంతమని వెటకరించారు. గుర్రా నికి బాగా గుగ్గిళ్లు తినిపిస్తే అది రోడ్డు మీద విసర్జించే ఫీకల్ మేటర్‌తో కాకులకు ఆహారం దండిగా దొరుకుద్దని దాని సారము. ఏం చేస్తే ఏం. మార్కెట్ లేవాలి. ఎవరు మునిగినా. కార్పొరేట్ల మీద పన్నుభారం తగ్గించి వాళ్ల లాభాలు పెంచితే ముందుగా అవి ఉద్యోగులకిచ్చే జీతాల్లో రిఫ్లెక్టవుతాయనే ఆశతో (ఆశపెట్టి) పాతికేళ్ల క్రితమే రీగనామిక్స్ పెట్టుబడిదారీ దేశాలను ఆకర్షించాయి. రీగన్ అడ్మిన్‌లో బడ్జెట్ ఎడ్వయిజర్ డేవిడ్‌స్టాక్‌మన్ ఆలోచన ఇది. కానీ, కొంతకాలానికి ఆయనే ఈ విధానం ప్రయోజనం మీద అనుమానంలో పడిపోయాడు.
అయినా ఆ తర్వాత మార్గరెట్ ధాచర్‌తో సహా ఎంతోమంది దేశాధినేతలు ఆ మార్గంలో నడిచారు. ఒబామా బెయిలవుట్లు ఈ సిద్ధాంతం వెలుగులోవే!గత కొన్ని దశాబ్దాలుగా వాస్తవిక అర్ధంలో ఉద్యోగకల్పన తరిగిపోతున్నది. నిజ వేతనాలు తరిగిపోతున్నవి. దీనంతటికీ కారణం ఈ విధానాల కారణంగా సంపద కొద్దిమంది దగ్గర కేంద్రీకృతమైపోవడం. 2012లో టాక్స్ జస్టిస్ నెట్‌వర్క్ జరిపిన అధ్యయనం ఇలాంటి సంపదసృష్టివాదుల నెత్తిన ఒకటి పీకింది. సూపర్‌రిచ్ చేతుల్లో పోగుపడ్డ సంపద నుంచి బొట్లేమీ కారడం లేదనీ, నిజానికి ఆ అపార సంప దంతా టాక్స్ హెవెన్స్‌లో దాచి పెట్టడమో నిజమైన డిక్లరేషన్స్ నుంచి తప్పిం చుకోవడమో జరిగింది కానీ, ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు తద్వారా పేదలకూ ఒరిగిందేమీ లేదని క్లియర్ పిక్చర్ తేల్చేసింది. ఏ సూచిక చూసినా ప్రపం చవ్యాప్తంగా ధనికులకూ పేదలకూ మధ్య అంతరాలు శరవేగంగా పెరిగిపో తున్నాయేగానీ ఎక్కడ తగ్గడం లేదని చెబుతూనే ఉన్నాయి.
సాటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ అంతరం మరీ ఎక్కువ. అది పెరుగుతున్న వేగం ఎక్కువ. ఈ అంతరాలు ఇదే వేగంతో సాగితే ఈ సంపద మరింత వారి చేతిలో పోగుపడటం ఖాయం. అభివృద్ధీ అది పోగుచేసిన సంపదల్లో భూమిపుత్రులకు భాగం దొరకనపుడే పోరాటాలు రగులుతాయి. లాటినమెరికా నుంచి తెలంగాణ వరకూ రుజువైంది ఇదే. బాబు గారిలాంటోళ్లు నేర్చుకోలేని పాఠమూ ఇదే.
చంద్రబాబు వంటి నేతలు రాష్ర్టాల్లోనూ మోడీగారు దేశంలోనూ కార్పొరేట్ల రుణం తీర్చుకునే పనిలో ఈ సంపద సృష్టి సిద్ధాంతపు దొంగజపం చేస్తున్నారు. చంద్రబాబు విధానాలు ఈపాటికే సంపదను కేంద్రీకృతం చేశాయి. ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో నియోరిచ్‌లు విపరీతంగా పెరిగిపోయారు. వాళ్లే ఆ తర్వాత రకరకాల స్కాముల్లో ఆర్ధికనేరాల్లో నిందులయ్యారు. సింగపూర్‌లు కడ తారు సరే ఆ ఆకాశహర్మ్యాల్లో నివసించేదెవరు. ఆ రహదారులపై రివ్వున దూసు కుపోయే ఖరీదైన కార్లెవరివి. సంపద సృష్టించా-ఆయన డబ్బా కొట్టకోడమూ వీళ్లు తాటికాయ లైన్లు బేనర్ పెట్టడమూ. హు హ్.
సంపద సృష్టికి ప్రజల చేతుల్లో వనరులు పెట్టాలి. చెరువులు బాగుచెయ్యాలి. పొలాలకు నీరివ్వాలి. విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. సంపద పెరగాలి. కానీ అది సమాజ సంపద కావాలి. సంపద పెరగాలి కానీ అది ప్రజల కోసం పెరగాలి. ప్రజల పరం కావాలి. అంతేకానీ విసిరేస్తే రాలే గింజలు కాదు. జనమంటే అడుక్కుతినేవాళ్లో నువు పారేసింది ఏరుకునే వాళ్లో కాదు. సృష్టించింది చాల్లే గానీ, అది కరిగి జనంలోకి ప్రవహించే చిత్తశుద్ధి చూపియ్యండి బాబు గోరూ! ఆఫ్టర్ ఆల్ మనది 20 కోట్ల మందికి తిండే దొరకని దేశం.
రెండు గరుడ ప్లస్ బస్సుల్లో పట్టే మంది కంటే తక్కువ మంది దగ్గర ఉన్న ఆస్తి ఎంతో తెలుసా? ఈ విషయం తెలుసుకుంటే నోటి వెంట మాట రాని పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోవటమే కాదు.. సంపన్నుడు మరింత స్ట్రాంగ్ అయిపోతున్నాడు.ఇక.. పేదోడి బతుకులు పేదగానే ఉండిపోతున్నాయి. అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నా.. వాటి ఫలాలు.. ప్రయోజనాలు పొందుతున్న వారు మాత్రం గుప్పెడు మంది మాత్రమే కావటం గమనార్హం.
ప్రపంచంలోని ఆస్తి మొత్తంలో సగం కేవలం 62 మంది దగ్గరే పోగుపడటం చూస్తే.. సంపన్నులు ఎంత స్ట్రాంగ్ అవుతున్నది ఇట్టే అర్థమవుతుంది. ఏడాదికేడాది గడిచే కొద్దీ సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోతున్నారు. ఈ వాదన నమ్మబుద్ధి కాకపోతే.. ఆక్స్ ఫామ్ చేసిన అధ్యయన వివరాలు చూస్తే కఠిన నిజం కళ్ల ముందు కనిపించక మానదు. 2010లో ప్రపంచంలోని సగం సంపద 388 మంది దగ్గర పోగుపడి ఉంటే.. 2011 నాటికి 177కి పడిపోయింది. ఇక.. 2012 వచ్చేసరికి 159 మందికి పరిమితమైతే.. 2013 నాటికి 92 మందికి కుంచించుకుపోయింది. ఇక.. 2014 నాటికి 80కి.. 2015 పూర్తి అయ్యేసరికి ప్రపంచంలోని సగం సంపద కేవలం 62 మంది వచ్చే రాశులు.. రాశులుగా పేరుకుపోవటం గమనార్హం.
మొత్తం ప్రపంచ జనాభా సుమారు 370 కోట్ల మంది ఉంటే.. అందులో సగం మంది దగ్గరున్న ఆస్తి.. కేవలం 62 మంది దగ్గర ఉండటం షాక్ అనిపించక మానదు. ఈ అపర కుబేరుల ఆస్తి మొత్తం (62 మందిది) లెక్కేస్తే వచ్చే మొత్తం రూ.11915983 కోట్లుగా తేలింది.
ఉపాధి రహిత అభివృద్ధి ఎందువల్ల?
* పెట్టుబడి పక్షపాతులైన ప్రభుత్వాలు
* ఆర్థిక వ్యవస్థలో లోపిస్తున్న సమతౌల్యం
* వికటిస్తున్న శ్రమ - పెట్టుబడి సంబంధాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుండి బయటపడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మొదలు ఐఎంఎఫ్ వరకూ ఉపాధి రహిత అభివృద్ధి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ ఆర్థిక వ్యవస్థల వివరాలతో అమెరికా, భారతదేశాల్లో ఉపాధి రహిత అభివృద్ధి తీరుతెన్నుల గురించి గత రెండు వారాలుగా చర్చించుకున్నాము. ఈ వారం అసలు అభివృద్ధి ఉపాధి రహితంగా ఎందుకు మారుతుందన్న మౌలిక ప్రశ్న గురించి చర్చించుకుందాం.
సంస్కరణల వేగంతో మరుగుపడిన వ్యవస్థాగత సమతౌల్యం
తాజా సంక్షోభానికి పూర్వం కూడా ఉపాధి రహిత అభివృద్ధి గురించి అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి నివేదికలు హెచ్చరిస్తూనే వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పాత్ర పెరిగే కొద్దీ ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేట్లు వేగంగా పెరుగుతున్నాయని, అంతే వేగంగా ఉపాధి కల్పన పెరగట్లేదు. వ్యవస్థల మధ్య సమతౌల్యం దెబ్బతింటోందనీ ఐఎల్‌ఒ మూడు దశాబ్దాలుగా మొత్తుకుంటూనే ఉంది. కానీ ప్రపంచీకరణ గాలుల్లో విహరిస్తున్న దేశాధినేతలకు ఈ హెచ్చరికలు చెవికెక్కలేదు. 2007లో సంక్షోభం తెరమీదకు రావటానికి ముందు కూడా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం - యుఎన్‌డిపి, ఐఎల్‌ఒ సంయుక్త అధ్యయనాన్ని నిర్వహించాయి. గతంలో వేగంగా అభివృద్ది చెందిన ఆసియా దేశాలుగానీ, నేడు అభివృద్ధి చెందుతున్న దక్షిణాసియా దేశాలుగానీ జాతీయ ఆర్థికాభివృధ్దితో సమానంగా ఉపాధి కల్పనలో అభివృద్ధి సాధించలేకపోయాయని ఆ అధ్యయనంలో తేల్చింది. అంతేకాదు. ఈ అసమతౌల్యం మున్ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుందని కూడా హెచ్చరించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ సమీకృతమవుతున్న కొద్దీ, ఆర్థిక వ్యవస్థలపై పెట్టుబడి ఆధిపత్యం బిగుస్తున్న కొద్దీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి-అభివృద్ధి మధ్య సమన్వయం లోపించటం గత మూడు దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామం. తొలుత సంపన్న దేశాల్లో 80వ దశకం చివర్లో కనిపించిన ఈ పరిణామం 90వ దశకం నాటికి విశ్వవ్యాప్త పరిణామంగా మారింది. స్థూలంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు 2003-2009 మధ్య కాలంలో సగటున 6శాతం చొప్పున వృద్ధి రేటు సాధిస్తే ఉపాధి కల్పన వృద్ధి రేటు మాత్రం 2 శాతానికి పరిమితం అయ్యింది. దీంతో వేగంగా పతనమ వుతున్న ఉపాధి అవకాశాలు పేదరికం నిర్మూలించాలన్న లక్ష్య సాధనపై ప్రభావం చూపిస్తున్నాయని తాజాగా ముగిసిస ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో పురోగతి గురించి ఈ సమావేశాలు చర్చించాయి.
మూలాలు తడమని ఉద్దీపనలు
గత రెండు సంవత్సరాలుగా వివిధ దేశాలు అమలు చేసిన ఉద్దీపనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో దీర్ఘకాల మాంద్యంలోకి ప్రవేశించకుండా అడ్డుకోగలిగాయన్న విషయంలో ఆర్థిక వేత్తలు, విశ్లేషకులూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయితే, దీనికి భిన్నంగా, ఆర్థికవ్యవస్థలు కోలుకొంటున్న వేగంతోనైనా ఉపాధి అవకాశాలు కనిపించకపోవటంతో దీర్ఘకాల మాంద్యం ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి - వినిమయం మధ్య ఉండాల్సిన సమతౌల్యం కూడా దెబ్బతిన్నది. ఉదారవాద విధానాలు పెట్టుబడికి డిమాండ్‌ను సృష్టించటంపై చూపించినంత శ్రద్ధాసక్తులు శ్రమశక్తికి డిమాండ్ సృష్టించటంపై చూపించకపోవటమే ఈ అసమతౌల్యానికి కారణం. ఈ అసమతౌల్యమే కొనుగోలు శక్తిపతనం, మదుపు చేయలేకపోవటం, ఆర్థిక వ్యవస్థల్లో వివిధ దశల్లో జరగాల్సిన కాపిటల్ ఫార్మేషన్ ప్రక్రియకు అంతరాయం కలగటం వంటి రూపాల్లో ప్రతిబింబిస్తోంది. దీని స్థానంలో పెట్టుబడి పోగుపడటం (కాపిటల్ ఎక్యుములేషన్) ప్రారంభమైంది. ఈ విషయంపై అంతర్జాతీయ కార్మిక అధ్యయనాల సంస్థ ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. అత్యధిక సందర్భాల్లో ఉద్దీపనలు సంక్షోభానికి కారకులైన బహుళజాతి ద్రవ్యసంస్థల లాభాలు నిలబెట్టటానికే దారితీశాయి. ఉద్దీనల కింద వెచ్చించిన నిధులు కూడా ఉత్పాదక రంగాన్ని పూర్తిగా విస్మరించి, నేరుగా మార్కెట్లోకి ప్రవేశించాయి. దాంతో లక్షల కోట్ల నిధులు వెచ్చించటం ద్వారా కలిగే ప్రయోజనాలు ఒనగూడలేదు. అందువల్లనే ఉద్దీపనల మోతాదు ఎక్కువగా ఉన్న అమెరికాలో కంపెనీలు, ద్రవ్య సంస్థల వద్ద లక్షల కోట్ల డాలర్ల నిల్వలుపేరుకుపోతున్న విషయాన్ని గతంలో ప్రస్తావించుకున్నాము. ఈ నిధులు మార్కెట్లోకి ప్రవేశిస్తే మళ్లీ స్పెక్యులేటివ్ కార్యక్రమాలకు తెరతీస్తాయి. ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత నిధుల ప్రవాహం ఎలా ఉందో గమనిస్తూనే ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు సున్నాకు దగ్గరకావటం, కుప్పలు తెప్పలుగా రుణాలు అందుబాటులోకి రావటంతో ఈ విధంగా సేకరించిన నిధులను వర్ధమానదేశాల స్టాక్ మార్కెట్లలో కుమ్మరిస్తున్నాయి. తద్వారా స్వల్పకాలంలో లాభాలు సంపాదించుకుని తిరిగి ఎక్కడ నుండి రుణం ద్వారా ఈ నిధులు సమకూర్చబడ్డాయో ఆయా మార్కెట్లకు వెళ్లిపోతున్నాయి. తాజా సంక్షోభానికి మూలపునాదిగా ఉన్న ఆర్థిక అంతరాలను పరిష్కరించటానికి ఉద్దీపనలు పూనుకోకపోవటంతో 'సంపన్న దేశాల్లో అభివృద్ధి తిరిగి సంక్షోభ పూర్వపు లక్షణాలు-ఆర్థిక అంతరాలు పెంచేదిశగా పయనిస్తోంద'ని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి మండలి వార్షిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
విస్తృతమవుతున్న పెట్టుబడి- శ్రమ శక్తి మధ్య వైరుధ్యం
ఈ పరిణామాలన్నీ పెట్టుబడికి, శ్రమశక్తికి మధ్య ఉన్న చారిత్రక వైరుధ్యాన్ని విస్తృతీకరిస్తున్నాయి. పైన చెప్పుకున్నట్లు ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక అవసరాలు తీర్చాల్సిన పెట్టుబడి సమీకరణ నేడు కొద్దిమంది చేతుల్లో బందీ అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఈ ప్రక్రియను మరింత వేగంతం చేసేవిగా ఉన్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నా ప్రభుత్వాలు రూపొందించే విధానాలు, అమలు చేసే నిర్ణయాలు పెట్టుబడికి డిమాండ్ సృష్టించేవిగా ఉంటున్నాయి. అంటే పెట్టుబడే ఆర్థిక వ్యవస్థలో సర్వస్వం అని నిర్ధారించుకుని పెట్టుబడి అవసరాలు తీర్చటమే తమ కర్తవ్యంగా భావిస్తున్నాయి. ఈ మేరకే విధానాలు రూపొందిస్తున్నాయి. ఈ విధానాలు ఎగుమతి దిగుమతి విధానాల రూపంలో ఉండవచ్చు, ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో ఉండవచ్చు. నేడు మన దేశంలో చర్చిస్తున్నట్లు పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీల రూపంలో కనిపించవచ్చు. ఈ చర్యలన్నింటి వెనక ఉన్న సారాంశం, తర్కం ఒక్కటే. పెట్టుబడి అవసరాలు మనం తీర్చగలిగితే మన అవసరాలు పెట్టుబడి తీరుస్తుందన్న తర్కం. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చిహ్నం ఉత్పత్తిసామర్థ్యం పెరగటం, వినిమయ సామర్థ్యం పెరగటం. లాభాలు సంపాదించటం. ఇవన్నీ సాధించటానికి పెట్టుబడి అనివార్యం. అయితే పెట్టుబడి ఒక్కటి ఉంటేనే సరిపోదు. ఏ ఆర్థిక వ్యవస్థల్లోనైనా స్థూల జాతీయోత్పత్తిలో మూడో వంతు శ్రామికవర్గం జత చేసే శ్రమ శక్తి. ప్రభుత్వ విధాన కర్తలు ఇప్పటి వరకూ ఈ జాతీయోత్పత్తికి దోహదం చేస్తున్న ఈ అంశం గురించి మర్చిపోయారు. దాంతో శ్రమశక్తి, పెట్టుబడి మధ్య వైరుధ్యంలో రాజ్యాంగయంత్రం పెట్టుబడి పక్షం వహించటంతో శ్రమశక్తి బలహీనపడింది. ఈ వైరుధ్యాన్ని సరిచేయటానికి శ్రమశక్తికి ఉన్న ఏకైక ఆయుధం సంఘం, సమైక్యత, సంఘటన, సంఘటిత పోరాటం మాత్రమే.
ఈ శ్రమ శక్తి అవసరాలు గురించి పట్టించుకోకకుండా కేవలం పెట్టుబడి అవసరాల ద్వారానే ఆర్థిక వ్యవస్థల అవసరాలు తీరతాయని భావించటం ప్రపంచీకరణ విధానాల్లోని ముఖ్యమైన లోపం. ఈ లోపమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరో మహా మాంద్యం అంచులవరకూ తెచ్చింది. పెట్టుబడికి డిమాండ్ సృష్టించే విధానాల వల్ల తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పత్తి సాధించే సామర్థ్యం సంపాదించటంతో పాటు విదేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించుకోవటం, పన్నుఎగవేతల స్వర్గధామాల్లో నిధులు దాచుకోవటం వంటి చర్యలతో పాటు ఉత్పత్తి క్రమంలో శ్రమశక్తి-పెట్టుబడి మధ్య ఉండాల్సిన నిష్పత్తి దెబ్బతింటోంది. ఫలితంగా ఉపాధిరహిత అభివృద్ధి జరుగుతోంది. ఈ నిష్పత్తిని, సమతౌల్యాన్ని సరిచేయాలంటే పెట్టుబడి డిమాండ్ సృష్టించే విధానాల నుండి వైదొలగి శ్రమశక్తి మార్కెట్‌కు డిమాండ్ సృష్టించే విధానాలను ప్రభుత్వం చేపట్టాలి. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. స్థూల సూక్ష్మ ఆర్థిక యాజమాన్యంలో మార్పులు తేవటం ద్వారా ఈ విధానాలను అమలు చేయవచ్చు. ఈ దిశగా విధానాలు మళ్లనంత వరకూ ఐరాస వాణిజ్య అభివృద్ధి మండలి అభిప్రాయపడినట్లు ''2011 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల మాంద్యంలోకి ప్రవేశించే ముప్పు'' నుండి ప్రపంచం బయటపడబోదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి