16, ఫిబ్రవరి 2015, సోమవారం

భావి అవసరాలకు అనుగుణంగా రాజధాని ఉండాలని..రాజధాని మళ్లీ మళ్లీ కట్టలేమన్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వస్తే నాకేదో ప్రయోజనం ఉంటుందని కొందరు ఆరోపించారని తాము మాత్రం ప్రజలకు లాభం చేకూర్చే ప్రాంతాన్నే రాజధానిగా ఎంపిక చేశామని ఆయన స్పష్టం చేశారు. భూసమీకరణ కొత్తగా తాము చేసింది కాదని, అహ్మదాబాద్‌, చండీగఢ్‌లో కూడా ఇదే పద్ధతిని అవలంభించారని చంద్రబాబు గుర్తు చేశారు. భూ సమీక రణ కోసం మంత్రివర్గం ఉపసంఘాన్ని నియమించి.. రైతులను ఒప్పించి నిర్ణయం తీసుకున్నామని ఆయన సభకు తెలిపారు.
గత ప్రభుత్వం సెజ్‌ల పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూ ములు లాక్కుందని, రాష్ట్రాన్ని దోచుకుందని చంద్రబాబునాయుడు ఘాటుగా ఆరోపించారు. దోపిడి దొంగల గుండెల్లో నిద్రపోతామని ఆయన  హెచ్చరించారు.  భూసమీకరణ ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని ప్యాకేజీని రైతులకు ఇస్తున్నామని ఆయన మరో సారి విస్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చే రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన వాళ్లు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రయోజనం చేకూరు స్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తుది ఫలసాయం తీసుకున్న తర్వాతే భూసమీకరణ చేపడుతామని ఆయన ప్రకటించారు.
తెలుగుజాతి గర్వపడేలా రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మానానికి కేంద్ర ఫ్రభుత్వం సహకరించాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నీ రాయితీలు, సదుపాయాలను రాష్ట్రానికి కల్పించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌ లాంటి రాజధాని నిర్మించాలంటే రూ. 5 లక్షల కోట్లు అవసరమవతూయని గతంలోనే తాను చెప్పి నట్లు గుర్తు చేశారు. పరిపాలన భవనాలు నిర్మించినంత మాత్రాన దానిని రాజధాని అనరని చంద్రబాబునాయుడు వ్యాఖ్యనించారు.
వైఎస్సార్సీ పార్టీ సభ్యులు సభలో సిఆర్‌డిఏ బిల్లు గురించి మాట్లాడుతున్నారా? లేక రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై మాట్లాడుతున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసిపి సభ్యులు గందరగోళంలో ఉన్నారని, పూర్తిగా ఆలోచించుకుని దేనిపై మాట్లాడుతారో నిర్ణయించుకోవాలని వాయన సూచించారు. కొందరు రాజధాని దొనకొండ, ఇడుపులపాయకు తీసుకోవాలని అనుకున్నారని జగన్‌ను ఉద్దేశించి ఆయన ఈవ్యాఖ్యలు  చేశారు. ముఖ్యమంత్రిగా తనకు రాష్ట్ర రాజధా నిని మా ఊరుకు తీసుకుపోయే అవకాశం ఉందని..కానీ ప్రజలకు న్యాయం చేయాలని..రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని, పది మందికి ఉపయోగప డాలని.. భావితరాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈనిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.  దొనకొండను ఒక ఇండస్ట్రీ యల్‌ ఏస్టేట్‌గా, స్మార్ట్‌ సిటీగా తయారు చేస్తామని ఆయన ప్రకటించారు. అదే మాదిరిగా కర్నూలును కూడా అభివృద్ది చేస్తామని ఆయన చెప్పారు.
రాజధాని నిర్మాణం కోసం లాండ్‌ పూలింగ్‌ తామేమీ కొత్తగా చేస్తున్నది కాదని ఆయన పేర్కొన్నారు. రాజధాని కోసం దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి విధంగా లాండ్‌పూలింగ్‌ ఎపికి ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధాని ఏర్పాటు కారణంగా అందరూ సంతోషంగా ఉండాలనేదే తమ అభిమతమని బాబు స్పష్టం చేశారు. లాండ్‌పూలింగ్‌ విషయంలో అందరికి న్యాయం చేస్తామన్నారు. ఎలా చేస్తే న్యాయం జరుగుతుందనేది ఆలోచిస్తున్నామన్నారు. ఉపయోగపడే అంశాలు ఎవరూ చెప్పినా వాటిని స్వీకరించి ప్రపంచంలోనే ఉత్తమమైన రాజధానిగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి