16, ఫిబ్రవరి 2015, సోమవారం

నేటినుంచే ఏపీ రాజధాని భూసేకరణ

Updated : 12/9/2014 1:46:35 AM
Views : 277
-భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు
-వారు ఇవ్వకుంటే ప్రభుత్వమే సేకరిస్తుంది
-ఆరు నెలల పాలన బాగుంది:ఏపీ చంద్రబాబు

హైదరాబాద్, డిసెంబర్ 8 (టీ మీడియా):రాజధాని కోసం చేపట్టనున్న భూసేకరణ మంగళవారం నుంచి అధికారికంగా మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొన్ని పార్టీలు కావాలనే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రాజధాని నిర్మాణం, ఇతరత్రా అవసరాల కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకుంటే ప్రభుత్వమే భూ సేకరణ చట్టం ద్వారా సేకరిస్తుందన్నారు.

హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో సోమవారం మీడియా సమావేశంలో రాజధాని భూముల సమీకరణ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉన్న మెట్ట భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. జరీబు భూములకు వెయ్యి గజాల నివాస స్థలం, 300 గజాల వాణిజ్య స్థలం అందజేస్తామన్నారు.

రైతులు పెంచిన టేకు చెట్ల అమ్మకానికి అనుమతిస్తామని, నిమ్మ, సపోట, జామ తోటల రైతులకు ఎకరానికి రూ.50,000 చొప్పున ఏకమొత్తంగా చెల్లిస్తామన్నారు. వాస్తు ప్రకారమే విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని నిర్మాణానికి సిద్ధపడినట్లు చెప్పారు. రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్ 75 కిలోమీటర్ల లోపు, మిడిల్ రింగ్‌రోడ్ 125 కిలోమీటర్ల లోపు, ఔటర్ రింగ్‌రోడ్ 200 కిలోమీటర్ల లోపు ఉంటుందని చెప్పారు. ఆరు నెలల తన పాలనలో బాగానే పనిచేశామన్నారు.కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ రూపొందించి ఇస్తుందన్నారు. సింగపూర్ వాణిజ్యమంత్రి ఈశ్వరన్‌తో సోమవారం ఆయన భేటీ అయ్యారు.రాజధాని పేరుతో కార్పొరేట్‌ భూసేకరణ
Posted on: Sun 23 Nov 00:43:28.681162 2014
* వామపక్షాల సభపై దాడిని ఖండించిన రైతు సంఘం
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
             ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పేరుతో బడా విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ వర్గాలకు ఉపయోగపడే విధంగా భూసేకరణ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆరోపించింది. ఈ మేరకు శనివారం సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. బలరామ్‌, వంగల సుబ్బారావు ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా తూళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో లాండ్‌ పూలింగ్‌లో మొదటి దఫాగా 56 వేల ఎకరాలు సేకరించడం తగదని వామపక్ష పార్టీలు తూళ్లూరులో సభ పెడితే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. ఈ దాడిని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి విజయవాడ, గుంటూరు పరిసరాల్లో 2,3 పంటలు పండే సారవంతమైన లక్ష ఎకరాల భూములను లాండ్‌ పూలింగ్‌ విధానం ద్వారా సేకరించాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ముందుకు సాగుతుందని విమర్శించారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల భూమి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లి బీడు భూములుగా మారాయని తెలిపారు. రింగ్‌ రోడ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వ పెద్దలు విజయవాడ, గుంటూరు చుట్టూ పదుల కిలో మీటర్ల పరిధిలో కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం డెల్టా భూములు సేకరించడం జరిగిందని అన్నారు.
కార్పొరేట్‌ సంస్థల ఒత్తిడికి తలొగ్గకుండా పంట భూములను, బీడుగా మార్చే ప్రయత్నాలను ఇప్పటికైనా ప్రభుత్వం విరమి ంచుకోవాలని సూచించారు.
                  వ్యవసా యానికి, పాడి పంటలకు, రైతు కూలీల జీవనాధారానికి దశాబాద్ధాల తరబడి నిలయంగా ఉన్న సారవంతమైన కృష్ణా డెల్టాని కనుమరుగు చేసే ప్రయత్నాలను మానుకో వాలని అన్నారు. రాజధానికి అవసరమైన కార్యాలయాలు, అసెంబ్లీ, సెక్రటరియట్‌ నిర్మాణానికి సింగపూర్‌ నమూనాలో బహుళ అంతస్థుల భవనాలు, లక్ష ఎకరాలు ఎందుకు అవసరమో చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.కలల రాజధాని నిజం కావాలంటే...
ఉమ్మడి రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన తరలింపు, నూతన సొంత రాజధాని నిర్మాణం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలను మెగా నగరాలుగా తీర్చిదిద్దే క్రమంలో ఆంధ్ర ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా గుంటూరు-విజయవాడ మధ్య కొత్త రాజధాని వస్తుందనే వూహాగానాలతోనే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి వూపు వచ్చింది. ఈ ప్రాంతంలో ఎకరం రూ.10 నుంచి 20లక్షలు ఉండే భూముల ధరలు నెలల వ్యవధిలో కోట్లలో పెరిగి చుక్కల్ని తాకాయి. వ్యాపార అవకాశాలు భారీగా పెరుగుతాయనే ఉద్దేశంతో వ్యాపారవేత్తలు, రియల్టర్లు తమ నల్లధనాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు.
అయిదు లేదా పదెకరాల కంటే తక్కువ భూములు కలిగిన రైతుల్లో పెరిగిన ధరల ద్వారా ప్రయోజనం దక్కేది కొద్దిమందికేననడంలో సందేహం లేదు. ఇందుకు గతానుభవాలే నిదర్శనం. పట్టణీకరణ విషయంలో అది నిరూపితమైంది. పట్టణీకరణ క్రమంలో దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాలకు సమీపంలో గట్టి పునాదులు కలిగిన వ్యవసాయరంగం బాగా దెబ్బతింది. ఆకర్షణీయ ధరలకు కొందరు, బలవంతపు భూసేకరణ చట్టాల కింద మరికొందరు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వచ్చిన ధనంతో వారు నిజంగా లాభపడ్డారా అంటే, అదీ లేదు. ఎంతోమంది రైతులు ఒకేసారి వచ్చి పడిన డబ్బులను విలాసాలకు, ప్రయోజనం లేని కార్యకలాపాలకు వృథాగా ఖర్చుపెట్టి సంసారాలను గుల్ల చేసుకున్నారు. చివరికి జీవనాధారం కోల్పోయి కుటుంబాన్ని పోషించేందుకు సరైన నైపుణ్యాలు లేక ఎంతోమంది రోడ్ల పక్కన దుర్భర జీవితాలు గడిపారు. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణం దిశగా సాగుతున్న ప్రభుత్వం అలాంటి సంఘటనలు నియంత్రించి, పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా జరగకుండా ఉండేందుకు ఎక్కువ కమతాలు కొందరి వద్దే ఉండిపోకుండా చిన్న చిన్న కమతాల కింద వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
ముందుకెళ్లే మార్గం? 
రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం ప్రభుత్వం 60:40 నిష్పత్తిలో సేకరించాలని భావిస్తోంది. అంటే ప్రభుత్వ ఆధీనంలో 60 శాతం భూములుంటాయి. మిగతా 40 శాతాన్ని దామాషా పద్ధతిలో స్థలాలు అప్పగించినవారికి పంచుతారు. ఈ క్రమంలో ప్రధాన జీవనాధారం కోల్పోయిన రైతులు ఎలా నెట్టుకురాగలరో చూద్దాం.
* బాధిత రైతులకు పరిహారం అందించాలి. కర్షకులకు అప్పగించిన భూముల్లో 40శాతానికి తక్కువ కాకుండా అభివృద్ధి చెందిన ప్లాట్లను ఇవ్వాలి. అవి నిర్మించినవి లేదా పూర్తిగా అభివృద్ధి చేసినవైతే మంచిది. ఎటువంటి భూములు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం తరఫునుంచి స్పష్టత లేదు. నివాసప్రాంత భూములా, లేక వాణిజ్య ప్రాంతంలోని భూములా, నగరంలోపలి భూములా, లేక వెలుపలవి కేటాయించాలా అన్నది తేల్చాలి.
* ప్రభావిత రైతులకు వర్తించే పరిహారం విధానం- వారికి భవిష్యత్తులో అందే ప్రయోజనాలను దూరం చేయకూడదు. ముఖ్యంగా 60శాతం అభివృద్ధి ప్రాంతంలో నిర్మించే ఐటీ పార్కులు, ఆతిథ్య, వాణిజ్య సముదాయాలు, నిరంతర ఆదాయ వనరులువంటి ప్రయోజనాలను రైతులకు దక్కేలా చేయాలి.
* ఇందులో భాగంగా చాలామంది రైతులు భూముల అభివృద్ధిపరులుగా కాకుండా, భూముల విక్రయదారులుగా మిగిలిపోయే అవకాశముంది. ఎందుకంటే వారికుండే బలహీన ఆర్థిక వనరులు, పరిమిత రుణ శక్తి వల్ల మూలధన ఆస్తులమీద లాభాలు, ఆదాయాలు కోల్పోతారు. అటువంటి పరిస్థితి ఎదురుకాకుండా చూడాలి.
* నిర్వాసిత రైతులకు ఉపాధి అవకాశాలు చూపగలగాలి. కొత్త వెంచర్లు, నిర్మాణం, రవాణా, రోడ్డు, ఆహార, కేబుల్‌ నెట్‌వర్క్‌, బ్రాడ్‌బ్యాండ్‌ వంటి రంగాల్లో యువకులకు స్వయం ఉపాధి లభించేలా ఉద్యోగ హామీ ఇవ్వాలి.
* రాజధాని, మెట్రో నగరాల అభివృద్ధిలో భూయజమానులను విస్మరించరాదు.
* భూములతో నిరంతర ఆదాయం కోల్పోయే రైతులకు ఏదో ఒక రూపంలో లబ్ధిచేకూర్చాలి.
ప్రతిపాదిత 60:40 శాతం విధానం సముచితంగానూ, ఆకర్షణీయంగానూ లేదు. ఇలాంటి వాటితో విలువైన భూములను ఇచ్చేందుకు రైతులెవరూ ముందుకు రారు. మరి ప్రత్యామ్నాయమేది? ఏదైనా మంచి ప్రతిపాదన ఉందా? ఇటు ప్రభుత్వం అటు జీవనోపాధికి మూలమైన పొలాలు కోల్పోయే రైతులు... ఇద్దరికీ మేలు చేసే మార్గాముందా? రాజధాని, నగరాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనద్వారా వచ్చే ప్రయోజనాలను వారికందిచలేమా? ఇటువంటి సమస్యలకు పరిష్కారం ఉంది. అదే... పుణె-షోలాపూర్‌ హైవేలోని అత్యాధునిక మగర్‌పట్ట టౌన్‌షిప్‌ నిర్మాణ విధానం. గతంలో హదాస్‌పూర్‌గా ఉన్న గ్రామాన్ని 400 ఎకరాలలో కొత్త నగరంగా నిర్మించడంలో అవలంభించిన విధానాన్ని ఇక్కడ అమలు పరచాలి. ఈ నగరం నిర్మాణంలో రైతు కుటుంబాలదే కీలకపాత్ర. మగర్‌పట్ట టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరుతో 120కిపైగా రైతు కుటుంబాలు సొంతంగా ప్రత్యేక నగరాన్ని నిర్మించుకున్నాయి. ఈ ఆదర్శ నగరం నిర్మాణం వెనుక సతీశ్‌మగర్‌ అనే వ్యక్తి ఉన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చురుకైన పారిశ్రామికవేత్త సతీశ్‌మగర్‌. ఎన్నో టౌన్‌షిప్‌లను విజయవంతంగా నిర్మించిన అనుభవమే కాకుండా... విక్రయ సమస్యలకు చక్కని పరిష్కారం చూపిన వ్యక్తి అతడు. ఈ ప్రాంతంలో వేగవంతమైన వృద్ధి సాధించేలా చేశారు. సకల సౌకర్యాలతో నిండిన ఆ టౌన్‌షిప్‌లో లేనిదంటూ లేదు. 20 ఐటీ టవర్లు, నాలుగు వందల అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, వినోద సౌకర్యాలు ఇలా సమస్తమూ అక్కడ ఉన్నాయి. నివాస ప్రదేశం, పనిచేసే కార్యాలయం, ఆట స్థలం, షాపింగ్‌ కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దారు. ఆశ్చర్యకర విషయమేమిటంటే... ప్రారంభంలో రూ.400 కోట్లుగా ఉన్న టౌన్‌ షిప్‌ మూలధనం విలువ, అది పూర్తయ్యేసరికి రూ.5000కోట్లకు చేరింది. ఆ పెరిగిన మూలధనం విలువతో రైతు వాటాదారులు లాభపడ్డారు. ఇప్పుడు వారంతా ఆర్థిక భద్రత, మంచి ఆదాయం, మెరుగైన జీవనశైలితో బతుకుతున్నారు. సాధారణ, సంప్రదాయ వ్యవసాయ కార్యకలాపాల కంటే నేడు అధికంగా లాభపడుతున్నారు. అనూహ్య విజయంతో మగర్‌పట్ట టౌన్‌షిప్‌ పేరు చుట్టుపక్కల మారుమోగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని మరెన్నో నమూనా టౌన్‌షిప్‌లు నిర్మించారు. అలాగే 51:49 మూలధనం వాటాతో మగర్‌పట్ట టౌన్‌షిప్‌ కంపెనీ మరికొన్ని నిర్మాణాలను సైతం చేపట్టింది. నూటికి నూరుశాతం రైతు వాటా, నిర్వహణతో నడిచే మగర్‌పట్ట టౌన్‌షిప్‌ నమూనా ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని నిర్మాణానికి సరిగ్గా సరిపోతుంది. ఈ విధానంతో రైతుల నుంచి సులభంగా, వివాదాలు, వ్యతిరేకతలు లేకుండా భూములు సేకరించవచ్చు. రాజధాని, మెగాసిటీల నిర్మాణం చేపట్టవచ్చు. ప్రభుత్వం, రైతులకు మేలు జరిగేలా, ప్రత్యేక వెంచర్‌గా తీర్చిదిద్దేందుకు భాగస్వామ్యం విషయంలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. ఇందుకోసం రైతు యాజమాన్య పద్ధతి కాకుండా... సరైన, పారదర్శక పాలనా విధానాలతో కూడిన రైతు- ప్రభుత్వ యాజమాన్య నమూనాను అనుసరిస్తే బాగుంటుంది.
'మగర్‌పట్ట'ణం ఆదర్శం
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి కావలసిన భూముల సేకరణ కోసంరాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 60:40 నమూనాకు... మగర్‌పట్ట టౌన్‌షిప్‌ విధానానికి తేడా ఏమిటి? మగర్‌పట్ట విధానం వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది...
* గ్రామం నుంచి 400 ఎకరాల భూమి సేకరించారు. రైతులిచ్చిన పొలాల విస్తీర్ణం ప్రకారం దామాషా పద్ధతిలో రైతులకు వాటాల కేటాయించారు.
* ఇందులో రైతులే టౌన్‌షిప్‌ అభివృద్ధివేత్తలుగా మారారు. నూతన బిజినెస్‌ వెంచర్‌లో భూ యజమానులే నూరుశాతం వాటాదారులు.
* టౌన్‌షిప్‌ ప్రణాళిక, డిజైన్‌, భూమి అభివృద్ధి నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు అంతా కంపెనీ సభ్యులే సంబంధిత రంగ నిపుణుల సహాయంతో చూసుకున్నారు. మధ్యవర్తులకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.
* నిర్మాణం పూర్తయ్యాక రైతు వాటాదారులు భూమి విక్రయంలో 30శాతం పొందుతారు. భవనాలు పూర్తిగా తయారయ్యాక కేవలం భూముల ధరే కాకుండా దానిపై అదనపు ప్రయోజనాలు కర్షకులు పొందుతారు. కంపెనీలోని వారి వారి వాటాలను బట్టి అమ్మకపు లబ్ధిని చెల్లిస్తారు.
* ఐటీ టవర్ల వంటి ప్రధాన నిర్మాణాలు కంపెనీ నిర్వహణ పరిధిలోనే ఉంటాయి. వాటి నిర్వహణ కోసం లీజుదారుల నుంచి కార్పస్‌ నిధి వసూలు చేస్తారు. ఈ ఆధునిక వెంచర్‌తో రైతులు కేవలం అదనపు విలువ ప్రయోజనాలే కాకుండా ఆకర్షణీయ వార్షిక ఆదాయాలను డివిడెండ్ల రూపంలో పొందుతారు.
* రైతు వాటాదారులు కంపెనీలో భాగస్వాములే కాకుండా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. భూ అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, సరకుల సరఫరా, రవాణా, ఆతిథ్య సేవలు, కమ్యూనికేషన్‌, చిల్లర, ఆహార రంగాల్లో వ్యాపారవేత్తలుగా పనిచేసే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. ఇటువంటి విధానం రైతు కుటుంబాలకు లాభదాయక, ఆకర్షణీయ ఆదాయం పొందే వెసులుబాటు కలిగిస్తుంది.
* టౌన్‌షిప్‌లో వివిధ రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలతో రైతు కుటుంబాలకు చెందిన యువకులకు మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. కంపెనీలో నిర్వహించే వివిధ కార్యకలాపాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు పెంచుకునే సౌలభ్యం వారికి కలిగింది.
* విశాల ప్రదేశంలో ఆసుపత్రులు, ఉద్యానవనాలు, విద్య వంటి అన్ని రకాల సౌకర్యాలతో కూడిన సొంత ఇల్లు రైతు వాటాదారులకు సొంతమైంది.
(రచయిత - డాక్టర్‌ వి.రంగారావు )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి