15, ఫిబ్రవరి 2015, ఆదివారం

భూ సేకరణ చట్టానికి అడ్డగోలు సవరణలు
Posted on: Fri 13 Feb 23:15:36.737177 2015

                   భారతదేశంలో భూ సేకరణ ఏ మేరకు జరిగిందని చెప్పడానికి ప్రణాళికాబద్ధమైన అధికార రికార్డులేవీ లేవు. అలాగే భూమిని సేకరించడం వల్ల ఎంతమంది నిర్వాసితులయ్యారనే సమాచారం కూడా లేదు. ప్రస్తుతం అస్తిత్వంలో లేని ప్రణాళికా సంఘం సూచించినట్లుగా 1947-2004 మధ్య కాలంలో నిర్వాసితులైన లేదా బాధితులైన వారి సంఖ్య దాదాపు ఆరు కోట్లుగా ఉంది. 70 లక్షల హెక్టార్ల అటవీ భూమి, 60 లక్షల హెక్టార్ల ఇతర ఉమ్మడి ఆస్తులతో సహా మొత్తం 2.5 కోట్ల హెక్టార్ల భూమి సేకరణకు గురైంది. ప్రాజెక్టులు నిర్మించడం వల్ల నిర్వాసితులైన బాధితుల్లో ఆదివాసీలు 40 శాతంగా ఉన్నారు. దళితులు 20 శాతం ఉన్నారు. గత 57 ఏళ్ళ గెజిట్‌ నోటిఫికేషన్ల ఆధారంగా గుజరాత్‌పై చేసిన అధ్యయనం ప్రకారం ఇదే కాలంలో అక్కడ ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులకు 32 లక్షల హెక్టార్ల భూమిని సేకరించింది. దీనివల్ల 25 లక్షల మంది నిర్వాసితులయ్యారు. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో 5 శాతం మంది నిర్వాసితులు కాగా 16 శాతం భూమి స్వాధీనం చేసుకోబడింది. ఇక్కడ గుజరాత్‌నే ప్రస్తావించడానికి కారణం ఇప్పుడు ఆ నమూనానే దేశం మొత్తానికీ వర్తింపజేయ చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, గత ఏడాది చివరిలో మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. భూ సేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ చట్టం-2013లో సక్రమమైన నష్టపరిహారం, పారదర్శకతకు గల హక్కును సవరిస్తూ ఆ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ముందే సవరించారు. ఈ సవరణల తర్వాత రైతాంగం, కౌలు రైతులు, ఆ భూముల మీద ఆధారపడే వ్యక్తుల కోణం నుంచి యుపిఎ చట్టంలోని లొసుగులను పరిశీలిస్తే ఈ లొసుగులన్నీ ఇతర అనేక రకాల నిబంధనలతో ముడిబడి ఉన్నాయి. అయితే, పారదర్శకతను, స్వచ్ఛతను, జవాబుదారీతనాన్ని నెలకొల్పడానికి గల ఆ నిబంధనలు బలహీనపడడమో లేదా తొలగించడమో జరిగింది. దానితో పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.
ప్రముఖ దేశీయ వలసవాద చట్టం
ఈ దశలో చరిత్ర గురించి కాస్త ప్రస్తావించడం ఉపయుక్తంగా ఉంటుంది. భారత్‌లో ప్రముఖ డొమైన్‌ చట్టం మూలాన్ని ఇంగ్లీషు కామన్‌ చట్టంలో కనుగొనవచ్చు. ఇది రాజ్యాంగబద్ధం కన్నా కూడా చట్టబద్ధమైనది. అయితే ఇక్కడ అభ్యంతరకమైన అంశం ఏమిటంటే, కేవలం ఆ చట్టాన్ని అమలు చేయడంలో కాదు, దాన్ని దేనికోసమైతే ఉపయోగిస్తున్నామో దాని గురించే. భూస్వామ్యవాదం, దోపిడీని అంతమొందించేందుకు గానూ నిరుపేద రైతాంగం, చిన్న రైతులు సాగించే ఉద్యమాల వల్ల ఎదురయ్యే ఒత్తిళ్ళ నేపథ్యంలో, స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉపయోగించే డొమైన్‌ చట్టం ఆస్తి హక్కుకు తిరిగి నిర్వచనం ఇవ్వడానికి ఉద్దేశించబడింది. మిగులు సీలింగ్‌ భూములను తిరిగి పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన భూ సంస్కరణల ద్వారా ఆస్తి హక్కును నిర్వచించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఇళ్ళు, పాఠశాలలు, ఇతర అభివృద్ధికి ఉద్దేశించిన మౌలిక సౌకర్యాలు అందజేయాలన్నది ఇక్కడ ఉద్దేశంగా ఉంది. అయితే దీన్ని వామపక్ష సంఘటన ప్రభుత్వాలు మినహా మరెవ్వరూ అమలు చేయలేదు. మెగా ప్రాజెక్టుల కోసం భూమిని సేకరిస్తూనే ఉన్నారు. ప్రైవేటు పరిశ్రమ ఈ అరాచకమైన వలసవాద చట్టాన్ని ఉపయోగిస్తూనే ఉంది. ఈ భూ సేకరణ వల్ల తీవ్రంగా నష్టపోయేవారు, బాధితుల జీవనోపాధి, వారి పునరావాసం వంటి విషయాల గురించి పట్టించుకోకుండా చాలా త్వరగా, చౌకగా, ఎలాంటి ప్రతిఘటన లేకుండా భూమిని స్వాధీనం చేసుకోవాలన్నదే ఈ చట్టం లక్ష్యంగా ఉంది. ప్రజా ప్రయోజనం అనేది ప్రభుత్వం ఏకైక, సంపూర్ణ విశేషాధికారంగా ఉండటం 1894 నాటి చట్టంలోని లొసుగుల్లో అతి ప్రధానమైనది. ఈ విశేషాధికారం ప్రజాస్వామ్య, న్యాయపరమైన పరిశీలనకు లొంగి ఉండకుండా చీకటి, నిరంకు శవాద పద్ధతుల ద్వారా ఈ విశేషాధికారాన్ని అమలు చేయాలని భావిస్తోంది. మరింత ఆకర్షణీయమైన ప్రజా ప్రయోజనాల ముసుగులో భూమిని తరుచుగా సేకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత దాన్ని మరే ఇతర ప్రయోజనాల కోసమో బదిలీ చేస్తారు. భూమి విలువను తక్కువగా అంచనా వేయడం ద్వారా ధరలు బాగా తక్కువగా ఉండేలా చేస్తూ వచ్చారు. ఫలితంగా చాలా తక్కువ నష్టపరిహారం వచ్చేది. ఇక్కడ భూమిని సేకరించేవారే (ప్రభుత్వం) ధరను నిర్ణయించేవారు. కానీ ఈనాడు ఆర్డినెన్స్‌ బాటను ప్రభుత్వం పట్టడంతో ప్రభుత్వం అనేది పెట్టుబడిదారులకు కేవలం ఒక రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా మారిపోయింది. ఇక్కడ ప్రైవేటు లాభాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజా ప్రయోజనాలకేనని సమర్థించడం జరుగుతోంది.
నయా ఉదారవాదం-మార్పు కోసం ఒత్తిడి
వ్యవసాయ రంగంలో తీవ్ర అసంతృప్తి, సంక్షోభం నెలకొన్న తరుణంలో ఈ చట్టాన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేయడం ప్రారంభించారు. విదేశీ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడులపై ఆంక్షలు ఎత్తివేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పై నుంచి కింది స్థాయి వరకు అసాధారణమైన పోటీ ఉండేది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ప్రభుత్వాలు మరిన్ని రాయితీలిచ్చి ఆకర్షించేందుకు ప్రయత్నించేవి. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే నిబంధనలు తేవాలంటూ అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు పారిశ్రామిక సంస్థలు కూడా డిమాండ్‌ చేసేవి. అదే సమయంలో వ్యవసాయ సంక్షోభం, అసమ్మతి పెరుగుతూ వచ్చింది. బలవంతంగానైనా సరే భూ సేకరణ జరిగింది. ఈ పరిస్థితి వల్ల అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరింత ప్రజాస్వామ్యయుతమైన, న్యాయ మైన చట్టం కావాలంటూ కింది స్థాయి నుంచి డిమాండ్‌ వచ్చింది. ఒక పక్క రైతులకు, భూమిపై ఆధారపడిన ఇతరులకు వాణిని వినిపించే అవకాశం ఇవ్వాలని, అలాగే పారిశ్రామిక రంగ అవసరాలను నెరవేర్చేలా చూడాలని - ఈ రెండు డిమాండ్ల మధ్య రాజీ ఉండేలా చూడాలని యుపిఎ ప్రభుత్వం భావించి దానిపై చర్చలు జరిపింది. ఈ కారణంతోటే, ఆ చట్టంలో అనేక లోపాలు, లొసుగులు, బలహీనతలు ఉన్నాయి. సక్రమమైన, న్యాయమైన నష్టపరిహారానికి గల హక్కు, భూ సేకరణలో పారదర్శకతకు, పునరావాసానికి, రీసెటిల్‌మెంట్‌కు యుపిఎ ప్రభుత్వం తెచ్చిన చట్టం స్థానంలో మరింత నయా ఉదారవాదంగా ఉండే ఇంకో వలసవాద చట్టాన్ని తెచ్చారు.
పురోగామి విజయాలు కాలరాయడం
2013 చట్టంలోని అన్ని పురోగామి విజయాలను, లాభాలను ఈ ఆర్డినెన్స్‌ తొలగించింది. 3ఎ అధ్యాయంలోని సెక్షన్‌ 5 పారిశ్రామిక కారిడార్లకు, జాతీయ భద్రతకు, గ్రామీణ మౌలిక సౌకర్యాలకు, ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులతో పాటు గృహ నిర్మాణం, సంబంధిత మౌలిక సౌకర్యాలకు మినహాయింపు ఇచ్చింది. వీటిన్నింటినీ ప్రజా ప్రయోజనాల నిర్ధారణ, సామాజిక ప్రభావం అంచనాల నుంచి మినహాయించింది. బహుళ పంటలను సాగు చేసే భూమి (2, 3 అధ్యాయాలు)కి రక్షణ కల్పించడం ద్వారా ఆహార భద్రతకు కూడా రక్షణ కల్పించే ప్రత్యేక నిబంధన నుంచి కూడా మినహాయింపు లభించింది. అన్నింటి కంటే అధ్వాన్నమైన అంశం ఏమిటంటే, ఈ ప్రాజెక్టున్నింటికీ భూ యజమానులు (70 శాతం ప్రభుత్వ, 80 శాతం ప్రైవేటు ప్రాజెక్టులు) 3(2) సవరణల కింద మినహాయించబడుతున్నారు. మినహాయింపులిస్తున్న ఈ సుదీర్ఘమైన జాబితా ఆచరణాత్మకంగా ప్రతి దానికీ బలవంత ంగానైనా భూ సేకరణను లేదా స్వాధీనాన్ని అనుమతిస్తోంది. 3(1) సవరణ ప్రభుత్వ ప్రయోజనాలు అనే నిర్వచనం పరిధిలోకి ప్రైవేటు ఆస్పత్రులను, ప్రైవేటు విద్యా సంస్థలను తెచ్చింది. ఈ రకంగా, ప్రైవేటు కంపెనీ అనే పదం స్థానంలో ప్రైవేటు సంస్థ అని పెట్టుకున్నాం. ఈ ప్రైవేటు సంస్థల పరిధిలోకి అన్ని ప్రభుత్వేతర సంస్థలు అంటే ప్రొప్రయిటర్‌, భాగస్వామ్యం, సహాయం, లాభార్జన లేని సంస్థలు ఉన్నాయి. ఎలాంటి ఉపయోగం లేకుండానే భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని నివారించేందుకు గానూ సెక్షన్‌ 101 ప్రకారం భూమిని తిరిగి భూ యజమానికి ఇచ్చేయడం లేదా ఒకవేళ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఐదేళ్ళపాటు నిరుపయోగంగా పడివుంటే అప్పుడు దాన్ని భూ బ్యాంక్‌కు బదలాయించడం చేయాలని పేర్కొంటోంది. దీనికి చేసిన సవరణ 9 ఏ ప్రాజెక్టునైనా నెలకొల్పడానికి ప్రత్యేకంగా నిర్దేశించిన సమయం లేదా ఐదేళ్ళు ఏది ఎక్కువ అయితే అది అమలు చేయాలని పేర్కొంటోంది. అయితే ఆ సవరణను దేనికీ పనికి రాకుండా చేశారు. దానికి ఎవరూ కట్టుబడి ఉండడం లేదు. పైగా, ఇలా స్వాధీనం చేసుకున్న భూమి విలువ బాగా పెరిగే వరకూ వేచివుండి ఆ తర్వాత దాన్ని చాలా సులభంగా అమ్మివేయడం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నారు. అన్ని ప్రైవేటు కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌ తిమింగలాలు చేసే పని ఇదే. 11వ సవరణ ద్వారా సెక్షన్‌ 113ను సవరించడం ద్వారా ఈ చట్టంలోని ఏ భాగాన్నైనా క్లిష్టతలను తొలగించే పేరుతో సవరించుకోవడానికి అవసరమైన చర్యలా తీసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం 2018 వరకు అమల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే సంబంధిత విభాగ అధిపతి కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని గత చట్టంలోని సెక్షన్‌ 87 పేర్కొంటోంది. దాన్ని మార్చి ఆ స్థానంలో సెక్షన్‌ 197ను ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యులుగా ఉండేందుకు చేసిన చిన్న ప్రయత్నం కూడా బెడిసికొట్టింది.
సెక్షన్‌ 113 వివిధ నిబంధనలను (నష్టపరిహారం, ఉపశమనం, పునరావాసం, ఇతర ఇటువంటి నిబంధనలు) అమలు చేసేందుకు రెండేళ్ళ కాలపరిమితి ఇచ్చింది. దాన్ని ఇప్పుడు ఐదేళ్ళకు పెంచారు. భూ సేకరణ లేదా స్వాధీన చట్టం -1894 కింద చేపట్టి, ఆమోదించిన కేసులు ఉంటాయి. కానీ ఇందులో భూమిని స్వాధీనం చేసుకోవడం కానీ లేదా నష్టపరిహారం చెల్లించకపోవడం కానీ జరగలేదు. కానీ, సెక్షన్‌ 24 నిబంధన మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. ఈ చట్టం ఆమోదించిన ఐదేళ్ళ తర్వాత లేదా ఇవన్నీ మురిగిపోతాయని ప్రకటించింది. తిరిగి తాజాగా చర్చలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొంది. మొత్తమ్మీద అనుసరిం చాల్సిన పద్ధతులు అన్నీ చాలా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ అనేక అవసరమైన, ప్రస్తుతం సాగుతున్న భూ సేకరణ లేదా స్వాధీన ప్రక్రియ పాత చట్టం ప్రకారం సాగిపోతున్నాయని చెబుతున్నారు.
వృద్ధి వ్యూహంగా భూ దురాక్రమణ
భూ సేకరణ చట్ట సవరణను ప్రజలకున్న వనరులపై జరిగిన మరింత దారుణమైన దాడిగా చూడవచ్చు. ఇంతవరకు నేరుగా ఈ భూమిపై హక్కు కలిగినవారికి ఆ అవకాశం లేకుండా చేసేందుకు ప్రజా వనరులపై దాడి చేశారు. పైగా అన్ని పురోగామి పరిరక్షణ చట్టాలను సవరించడానికి ఈ చర్య చేపట్టారు. ఈ చట్టాలు ప్రజలు ఎంతగానో శ్రమిస్తే వచ్చినవే. ఇక్కడ అమలు చేసిన అభివృద్ధి నమూనా ఏమిటంటే ప్రైవేటు రంగానికి ద్రవ్య, సహజ వనరుల బదిలీ, అదే ఇక్కడ బదిలీ వ్యూహం. యుపిఎ ప్రభుత్వం 2013లో ప్రాజెక్ట్‌ పర్యవేక్షణా గ్రూపును ఏర్పాటు చేసింది. 437 ప్రాజెక్టులకు గానూ 153 ప్రాజెక్టులను ఆమోదించింది. ఒక్కో ప్రాజెక్టు విలువ వెయ్యి కోట్ల పై మాటే. అంటే మొత్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల విలువ రూ.15 లక్షల కోట్లకు గానూ ఆమోదించిన ప్రాజెక్టుల విలువ రూ.5.3 లక్షల కోట్ల పైమాటే. ఎన్‌డిఎ ప్రభుత్వ వచ్చాక ప్రాజెక్టులపై ఆ నిషేధాన్ని రూ.500 కోట్లకు తగ్గించింది. పైగా డీమ్డ్‌ క్లియరెన్స్‌లను ప్రవేశపెట్టింది. నిర్దిష్ట కాల పరిమితిలో ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తకపోతే అవి ఆమోదించబడినట్లే అని అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో సమాజంలోని అన్ని ప్రగతిశీల వర్గాలు, శక్తులు కలిసి ఈ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా పోరాడాల్సిన అవసరం  ఎంతైనా ఉంది.
- స్మితా గుప్తా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి